Group B – Bangladesh vs Scotland, 2nd Match: టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి మూడు బంతుల్లో విజయానికి 18 పరుగులు అవసరం కాగా… బంగ్లాదేశ్ ప్లేయర్ మెహిదీ హసన్ వరుస షాట్లు బాది (సిక్సర్, ఫోర్) ఆశలు రేకెత్తించాడు. అయితే, ఆఖరి బంతికి స్కాట్లాండ్ ఆటగాడు సఫ్యాన్ షరీఫ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. ఒక పరుగు మాత్రమే ఇచ్చి తమ జట్టు గెలుపును ఖరారు చేశాడు.
తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. క్రిస్ గ్రీవ్స్(45), మన్సే(29), మార్క్ వాట్(22) రాణించారు. క్రిస్ గ్రీవ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లు మెహిదీ హసన్‌కు 3, టస్కిన్ అహ్మద్‌కు ఒకటి, ముస్తాఫిజుర్‌కు 2, సైఫుద్దీన్‌కు 1, షకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్లు: స్కాట్లాండ్- 140/9 (20)
బంగ్లాదేశ్- 134/7 (20)