Bright Telangana
Image default

హుజురాబాద్, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

huzurabad by election

హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా నిబంధనల నడుమ ఈ ఉప ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. హుజురాబాద్, బద్వేల్ రెండు స్థానాల్లో బైపోల్స్ జరగనుండగా.. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 13గా ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. బైపోల్స్‌ పోలింగ్ తేదీ అక్టోబర్ 30 కాగా.. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఇక అదే రోజున కౌంటింగ్ పూర్తి కాగానే ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూనే.. సభల్లో వెయ్యి మందికి పైగా జనం మించరాదని క్లారిటీ ఇచ్చింది.

Related posts

దళిత బంధు అమలు చేయకపోతే.. ఉద్యమం తప్పదు : బండి సంజయ్ వార్నింగ్

Hardworkneverfail

Huzurabad By Election: నేడే హుజురాబాద్ పోలింగ్

Hardworkneverfail

Huzurabad By Election: బీజేపీ హుజురాబాద్ నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్

Hardworkneverfail

Huzurbad By Elections: ప్రైవేట్ వాహనంలో ఈవీఎంల తరలింపు ?

Hardworkneverfail

Huzurabad By Elections: కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల రాజేందర్

Hardworkneverfail

Huzurabad – Badvel By Election 2021 : ముగిసిన హుజూరాబాద్, బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్

Hardworkneverfail