Bright Telangana
Image default

GodFather OTT Update: మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్..

god father ott update

God Father OTT Update : దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ అయినా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

మెగాస్టార్ గత మూవీ ఆచార్య ఫ్లాప్‌తో నీరసించిపోయిన మెగా అభిమానులకు ఈ మూవీ ఫలితం కొద్దిగా ఊరటను కలగజేసింది. ఈ మూవీలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేయడంతో ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు డిజిటల్ లో కూడా రిలీజ్ అవ్వడం కన్ఫాం అయిపొయింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ గాడ్ ఫాదర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ మూవీని నవంబర్ 19 న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. దీంతో మెగా అభిమానులు ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే నవంబర్ 19 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారిగా తెలుగులో నటించిన చిత్రమిది. చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్ నటించిన ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమన్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

Related posts

Bhola Shankar Movie: చిరంజీవి ‘బోళా శంకర్’ మూవీ ప్రారంభం..

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. ?

Hardworkneverfail

GodFather Movie: గాడ్‌ఫాదర్‌ మూవీలో చిరంజీవికి తల్లిగా గంగవ్వ ?

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail

‘సిరివెన్నెల’ మనకి ఇక లేడు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు : చిరంజీవి

Hardworkneverfail

Acharya: చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఆచార్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail