Megastar Chiranjeevi Sensational Comments On YCP Rajya Sabha Ticket Offer : మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ లో చిరంజీవికి వైసీపీ నుండి రాజ్యసభ టికెట్ ఆఫర్ అంటూ అదేపనిగా ప్రచారం చేస్తున్నారు. దీంతో చిరంజీవి అన్నిటికీ చెక్ పెడుతూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు మీడియా ముందు ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు.