Bright Telangana
Image default

God Father Trailer : నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను: ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ రిలీజ్

god father trailer

God Father Trailer : మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ గాడ్ ఫాదర్. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘మన స్టేట్ సీఎం.. పీకేఆర్ అకస్మిక మరణం.. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక’ అంటూ పూరి జగన్నాథ్ బేస్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఇక నెక్స్ట్ సీఎం ఎవరు అని అనగానే ది మోస్ట్ డేంజరస్ మిస్టీరియస్ మ్యాన్ బ్రహ్మ అంటూ చిరంజీవి ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఇక రాజకీయ డైలాగ్ తో దుమారం రేపిన ఆ డైలాగ్ గాడ్ ఫాదర్ లోనీదే అని క్లారిటీ ఇచ్చేసాడు చిరంజీవి. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, నా నుంచి రాజకీయం దూరం కాలేదు అని జైల్లో చిరంజీవి చెప్పే డైలాగ్ కు థియేటర్లు చిరిగిపోవడం ఖాయమనిపిస్తోంది. ఇక అన్న అంటే ఇష్టం లేని పాత్రలో నయన్ ఎంతో పొందికగా కనిపించగా.. విలన్ గా సత్యదేవ్ ఒక రేంజ్ లో విలనిజాన్ని పండించాడు.

ఇక నా ముందు నువ్వెంత పిల్ల బచ్చా అంటూ సత్యదేవ్ కు చిరంజీవి ఇచ్చే స్వీట్ వార్నింగ్ అదిరిపోయింది. ఒక రాజకీయ పెద్ద చనిపోతే ఆ సీట్ కోసం కాచుకొని ఉన్న రాజకీయ నేతలు, వారి కుటుంబాన్ని రోడ్డు మీదకు ఈడ్చే ఇంటి అల్లుడును ఆ కుటుంబానికి రుణపడి ఉన్న ఒక వ్యక్తి ఎలా దారిలో పెట్టాడు అనేదే గాడ్ ఫాదర్ కథగా తెలుస్తోంది. ఇక మూవీ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది మాత్రం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎంట్రీ.. బడా భాయ్ ఏది చెప్తే అది చేసే ఛోటా భాయ్ పాత్రలో సల్మాన్ ఖాన్ పిచ్చెక్కించాడు. చివరిలో సల్మాన్ ఖాన్.. అతని వెనుక సింగంలా చిరంజీవి వస్తున్న షాట్ అయితే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందనే చెప్పాలి. ఇక చిరుకు అసిస్టెంట్ గా సునీల్ కనిపించగా.. పోలీస్ ఆఫీసర్ గా సముద్ర ఖని కనిపించారు. ఇక ముఖ్య పాత్రల్లో మురళీ శర్మ, బ్రహ్మజీ కనిపించి మెప్పించారు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అరుపులే అని చెప్పొచ్చు. మొత్తానికి ట్రైలర్ తో ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది.

Related posts

RRR Movie Promotions : సల్మాన్ ఖాన్ తో నాచో నాచో స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి మూవీలో సల్మాన్‌ఖాన్‌.. బ్రిట్నీ స్పియర్స్‌తో అదిరిపోయే పాట

Hardworkneverfail

Megastar Chiranjeevi: మెగాస్టార్ నోట ‘రంగ మార్తాండ’ షాయరీ

Hardworkneverfail

Godse Teaser : మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి.. ‘గాడ్సే’ టీజర్

Hardworkneverfail

GodFather OTT Update: మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్..

Hardworkneverfail

Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు తెప్పించిందా..!

Hardworkneverfail