Bright Telangana
Image default

Waltair Veerayya: పార్టీకి రెడీగా ఉండు.. మాసీవ్ స్టెప్పులతో బాసొస్తుండు!

Waltair Veerayya - Boss Party Song Promo

Waltair Veerayya – Boss Party Song Promo : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రాబోతోంది. గతంలో ఒక చిన్న గ్లిమ్ప్స్ తో వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి మాస్ మూల విరాట్ గా కనిపిస్తాడు అనే హింట్ ఇచ్చిన మూవీ యూనిట్, ఇప్పుడు బాస్ పార్టీ అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు.

వెల్కం టు ది బిగ్గెస్ట్ పార్టీ, బాస్ పార్టీ అంటూ మొదలిన ఈ ప్రోమోలో దేవి మైక్ అందుకోని.. ‘నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో, బాస్ వస్తుండు’ అంటూ చిరుకి ఎలివేషన్స్ ఇచ్చాడు. లిరిక్స్ ఎండ్ అయ్యే టైంకి చిరు, లుంగీ కట్టి బీడీ పట్టి గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విజువల్ అదిరిపోయింది. శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసిన ఈ బాస్ పార్టీ సాంగ్ చిరు ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

నవంబర్ 23 సాయంత్రం 04:05 నిమిషాలకి బాస్ పార్టీ ఫుల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. అయితే పాట బాస్ నాటు స్టెప్పులతో ఇరగదీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఫుల్ లిరికల్ సాంగ్ లో బాస్ స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. ఈ పాటని దేవిశ్రీప్రసాద్ తో పాటు నకాష్ అజీ హరి ప్రియలు ఆలపించారు. తనే ఈ పాటకు లిరిక్స్ అందించడం విశేషం. ‘శంకర్ దాదా ఎంబీ బీఎస్’ మూవీతో చిరు – దేవీల జర్నీ మొదలైంది. వీరి కలయికలో ఇప్పటి వరకు నాలుగు సాలీడ్ హిట్ లు వచ్చాయి. ఇది 5వ మూవీ. ఫస్ట్ సాంగ్ తో ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ఆడియోని ఏ రేంజ్ లో అందించాడో ఫ్యాన్స్ కి క్లారిటీ రాబోతోంది.

Related posts

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్రం

Hardworkneverfail

Chiru with PM Modi : భీమవరం వేదికగా ప్రధాని సభకు మెగాస్టార్ కు ఆహ్వానం..

Hardworkneverfail

Mega 154 Pooja Ceremony : మెగాస్టార్‌ కోసం స్టార్ డైరెక్టర్స్ తరలి వచ్చారు

Hardworkneverfail

Saami Saami Song: రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్..

Hardworkneverfail

Pushpa : పుష్ప మూవీ నుంచి మరో మాస్ సింగిల్..

Hardworkneverfail

Pushpa Fourth Single: ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

Hardworkneverfail