ఈసారి బిగ్‌బాస్ షోపై పాజిటివ్ ఒపెనియన్ ఆడియన్స్‌కు కలగడం లేదన్నది ముందు నుంచి వినిపిస్తున్న వాదన. హౌస్‌మేట్స్ ఆటతీరు ప్రేక్షకులకు ఏమాత్రం రుచించడం లేదు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 ఫెయిల్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రతి శనివారం నాగార్జున రావడం..ఇంటి సభ్యులకు క్లాస్ తీసుకోవడం.. గేమ్ ఎలా ఆడాలో సూచించడం కామన్‌గా మారిపోయింది. అయితే ఈ వారం ఇంట్లో మాములు రచ్చ జరగలేదు. ఈ క్రమంలోనే శనివారం విడుదలైన ఎపిసోడ్లో నాగార్జున ఫుల్ ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరి ఫోటోను చింపేస్తూ మరీ క్లాస్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఈరోజు సన్నీకి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్కులో సన్నీ శ్రుతి.. యానీ మాస్టర్ శ్రుతిమించి ప్రవర్తించడంతో నాగ్ వారిద్దరీ కడిగిపారేశారు.. సన్నీ ఫోటోను ఏకంగా నాగార్జున చింపేస్తూ మరీ ఫైర్ అయ్యారు. అలాగే గేమ్ తప్పుగా ఆడోద్దని.. గెలుపు కూడా పద్దతిగా గెలవాలని కాజల్‌ను హెచ్చరించాడు. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమోలు చూసి ఎంజాయ్ చేయండి.