బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఏడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. అనీ మాస్టర్, లోబో, ప్రియ, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో ఈ వారం ప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బంగారు కోడిపెట్ట కెప్టెన్సీ టాస్కులో సన్నీ, ప్రియ మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రియకు మైనస్‌గా మారిందని ఓటింగును బట్టి చూస్తే అర్థమవుతోంది.
సన్నీతో గొడవపడటం ప్రియకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమె బిహేవియర్ బాగోలేదని కామెంట్లు వినిపించాయి. సన్నీని చెంప పగలకొడతా అని మాట్లాడటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా సన్నీ కెప్టెన్ అయ్యేందుకు ఆనీ మాస్టర్ సహకరించడంతో ఆమెపై పాజిటివ్ ఏర్పడింది.
దీంతో ఈ వారం ప్రియ ఎలిమినేట్ కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆరు వారాల్లో ఐదుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో ఈ వారం మేల్ కంటెస్టెంట్‌ను బయటకు పంపాలని బిగ్‌బాస్ భావిస్తే జెస్సీ డేంజర్ జోన్‌లో ఉంటాడు. ఈ వారం అతడు సీక్రెట్ టాస్కులో విఫలం కావడం అతడిపై నెగిటివిటీని తెచ్చిపెట్టింది. దీంతో అతడిపై ప్రేక్షకులు సంతృప్తి లేకపోవడంతో ఓట్లు తక్కువ వేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మరో 24 గంటల్లో తెలిసిపోనుంది.