8వ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఆరుగురు. రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబో ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. లోబో ఈ సారి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. తనదైన మాటలతో.. పంచులతో హౌస్ లో నవ్వులు పూయించిన లోబో.. ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక అందరితో కలివిడిగా ఉంటూ వచ్చిన లోబోకి ఈ వారం నామినేషన్లలో ఉన్న వారిలో లోబోకు అతి తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో లోబో బయటకు రాక తప్పలేదు. దీపావళి సందర్భంగా ఆదివారం ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగింది.