కెప్టెన్సీ టాస్కులో రవి, సిరి, సన్నీ, కాజల్లకు బ్రిగ్స్తో టవర్ కట్టే టాస్క్ ఇచ్చారు బిగ్బాస్. టవర్ ను కట్టడంతోపాటు.. కట్టిన టవర్ ను కూలిపోకుండా కాపాడుకోవాలని.. మిగిలిన ఇంటి సభ్యులు ఆ టవర్ కూలగొట్టడానికి బాల్స్ తో కొట్టాలని చెప్పారు. ఎవరి టవర్ అయితే పడిపోకుండా ఉంటుందో వాళ్లే ఇంటి కెప్టెన్ అని చెప్పారు బిగ్బాస్. అయితే మొదటి రౌండ్ లోనే కాజల్ టవర్ పడగొట్టేశారు యానీ మాస్టర్ గ్రూప్ సభ్యులు. ఇక రెండో రౌండ్ లో సన్నీ ఔట్ అయ్యాడు.
ఇక మూడో రౌండ్ వచ్చే సరికి..సిరి, రవిలు మాత్రమే మిగిలారు. అయితే ఇక్కడ సన్నీ బాల్స్ విసురుతుండగా.. సిరి అతడినికి అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆటలో ఉన్నప్పుడు తనను పట్టుకుంటే బ్రిగ్స్ తంతా అని హెచ్చరించాడు సన్నీ. దీంతో ఎవర్ని తంతావ్ అంటూ మరింత రెచ్చగొట్టింది సిరి. నేను మీద పడితే అప్పడం అయిపోతావ్ అంటూ సన్నీ ఫైర్ అవ్వగా.. పోయి అప్పడాలు అమ్ముకో అంటూ మరింత రెచ్చగొట్టింది. దీంతో సీన్ లోకి వచ్చాడు షణ్ముఖ్.. మధ్యలోకి రావద్దంటూ సన్నీ హెచ్చరించినా పట్టించుకోకుండా.. మరింత రెచ్చగొట్టాడు షణ్ముఖ్. దీంతో వీరిద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.