ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఒక అవకాశం ఇచ్చాడు. ఇందుకోసం ‘జీవితమే ఒక ఆట’ అనే టాస్క్ ఏర్పాటు చేశాడు. ‘ఏ సభ్యులైతే చివరిగా సేఫ్ జోన్ డోర్‌లోకి వెళతారో వారు, వారి దగ్గర ఏ సభ్యుల బ్యాగ్ ఉందో ఇద్దరూ డేంజర్ జోన్‌లోకి వెళతారు. అప్పుడు సేఫ్ జోన్‌లో ఉన్న నామినేటెడ్ సభ్యులు ఎవరిని సేఫ్ జోన్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారో నిర్ణయించాల్సి ఉంటుంది’ అని టాస్క్‌కు రూల్‌గా పెట్టాడు.
ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ‘అమ్మాయిలు నలుగురే ఉన్నారని కాజల్ అన్నది. ఆమె ఓటు వేయడం వల్లే ప్రియ, శ్వేత వెళ్లిపోయారు’ అని శ్రీరామ్ కొత్త వాదన లేవనెత్తగా, ‘ఉమెన్ కార్డు అని ఎలా అంటారు’ అని అనీ మాస్టర్ ప్రశ్నించారు.
‘సన్నీ స్ట్రాంగ్ ప్లేయర్. జెస్సీకి ఇమ్యూనిటీ అవసరం’ అని తాను భావిస్తున్నట్లు మానస్ చెప్పాడు. చివరిగా బ్యాగులకు ముడులు వేసి, షణ్ముఖ్ కొత్త వివాదానికి తెరలేపాడు. మరి ఈ టాస్క్‌లో గెలిచి ఎవరు సేఫ్ అయ్యారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే! అన్నట్లు ఇక ఈ వారం శ్రీరామ్, మానస్, రవి, సన్నీ, జస్వంత్, ప్రియాంక, విశ్వ, కాజల్, అనీ, సిరి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. కెప్టెన్ అయిన కారణంగా ఒక్క షణ్ముఖ్ మాత్రమే సేఫ్ అయ్యాడు.