Bright Telangana
Image default

BRAHMASTRAM Movie : ‘బ్రహ్మాస్త్రం’ మూవీ మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది..!

బ్రహ్మాస్త్ర మూవీ మోషన్‌ పోస్టర్‌

BRAHMĀSTRAM Part One – Shiva : ‘బ్రహ్మాస్త్రం’ మూవీ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన మేకర్స్, సినీ లవర్స్ నుండి మంచి స్పందనను అందుకుంటున్నారు. మన విశ్వంలో ఏదో జరుగుతోంది. అది సామాన్యుల ఊహకు కూడా అందనిది. అది అత్యంత పురాతన మహాశక్తి. అదో అస్త్రం. అదేంటి? అంటూ ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో మొదటి భాగం ‘శివ’ గా వస్తోంది.ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ మొదటి భాగం 09.09.2022న పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక సినిమా తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ గా విడుదలవుతోంది. ఈ మూవీని మూడు పార్టులు గా విడుదల చేస్తున్నారు. త్రిమూర్తుల కోణంలో ఈ విశ్వం యొక్క మహాశక్తిని ఈ మూవీతో ఆవిష్కరించబోతున్నారు. మిగతా రెండు పార్టులు ‘బ్రహ్మ, విష్ణు’ గా విడుదల కాబోతున్నాయి.

Related posts

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ అవుట్

Hardworkneverfail

RRR Movie : విజువల్ వండర్.. అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లింప్స్..

Hardworkneverfail

LIVE: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ప్రెస్‌మీట్

Hardworkneverfail

Brahmastra Movie: బాయ్‌కాట్ బ్ర‌హ్మాస్త్ర పేరిట సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo : సన్నీ ఏవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తాడా ? సేవ్ చేస్తాడా ?

Hardworkneverfail

RRR Movie Promotions : సల్మాన్ ఖాన్ తో నాచో నాచో స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్

Hardworkneverfail