ఈ వారం ఎలిమినేషన్‌లో ఊహించనిది జరిగింది. రవి మరియు కాజల్ మధ్య ఎలిమినేషన్ సమయం వచ్చింది. ప్రేక్షకులు తమ మద్దతును అందించి, ఓట్ల రూపంలో నమోదు చేసుకున్నప్పటికీ, హౌస్ మెట్ అయిన సన్నీకి తన ప్రత్యేక ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని ఉపయోగించడం ద్వారా ఈ ఇద్దరు తలరాత మార్చగల శక్తి ఉంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని ఉపయోగించాల్సిందిగా సన్నీని కోరాడు నాగార్జున. తాజా ప్రోమోలో, సన్నీ ఎవరిని రక్షించాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. తనకు ఇద్దరు హౌస్‌మేట్స్ అంటే ఇష్టమని సన్నీ అన్నాడు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు తెలియాలంటే ఈరోజు రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.