గత సీజన్స్‌తో పోల్చుకుంటే ఈసీజన్‌లో రచ్చ కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ కూడా జరిగిపోయాయి. హౌస్‌లో ఉన్న సరయు, ఉమా దేవి ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. లాస్ట్ వీక్ లహరి కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది. ఈ వారం ఎలిమినేషన్లో సన్నీ, కాజల్, లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్, ప్రియ ఉన్నారు. వీరిలో ఫైనల్ గా లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్ మిగిలారు. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు.
అయితే గత కొద్దిరోజులుగా యానీ మాస్టర్ ఎలిమినేట్ కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడుతా సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హౌస్ మేట్స్ అంతా నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సినిమాలో పాటలకు అదిరిపోయే డాన్స్ లు వేస్తూ ఆకట్టుకున్నారు. జంటలుగా విడిపోయి మరీ డాన్స్ చేశారు హౌస్ మేట్స్.. వీరిలో హమీద -శ్రీరామ్.. అలాగే షన్ను- సిరీ డాన్స్ ఆకట్టుకుంది. ఇక హౌస్ మేట్స్ డాన్స్ కు నాగార్జున ఫిదా అయ్యారు. నా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి అంటూ ఎమోషనల్ అయ్యారు నాగార్జున. ఇక చివరిలో ఎలిమినేషన్ ప్రక్రియకు వచ్చే సరికి ఆసక్తి మరింత పెరిగింది. సిరి, లోబో, యానీ మాస్టర్ , నటరాజ్‌లలో ఊహించని విధంగా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. దాంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక హౌస్ నుంచి నటరాజ్ బయటకు వెళ్తుంటే మిగిలిన వారు ఎమోషనల్ అయ్యారు.