దీపావళి సందర్భంగా బిగ్ బాస్ సర్ ప్రైజ్ గెస్ట్స్ తో వీక్షకులను అలరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దేవరకొండ బ్రదర్స్‌తోపాటు నాయికలు శ్రియ, అవికా గోర్, బుల్లితెర వ్యాఖ్యాత సుమ, గాయని, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కల్పన ‘బిగ్‌బాస్’ హౌజ్‌లో అడుగుపెట్టారు. దీపావళి శోభని ముందుగానే తీసుకొచ్చారు. డ్యాన్స్, పాటలతో మాంచి వినోదం పంచారు. ఈ ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. బిగ్ బాస్ 5 తెలుగు హౌస్ దీపావళి వారంలోకి ప్రవేశించడానికి సర్వం సిద్ధమైంది. ప్రోమోల ప్రకారం యాంకర్ సుమ, దివి, అవినాష్, అరియానా, గాయని కల్పన, సోహెల్ తో పాటు ఇతర ప్రముఖులు కూడా బిగ్ బాస్ హౌస్‌ని సందర్శించనున్నారు. దీపావళి పండగ సంబరాల్లో భాగంగా కొందరు సినీ తారల్ని ‘బిగ్‌బాస్’ ఆహ్వానించాడు.