బిగ్‌బాస్ హౌస్‌లో సిరి – షణ్ముఖ్ ఫ్రెండ్‌షిప్ కొన్నిసార్లు హద్దులు మీరుతోందని సోషల్ మీడియాలో ఎప్పటినుంచో కామెంట్లు చేస్తున్నారు. అంతెందుకు సిరి, షణ్ముఖ్ కూడా ఏదో తప్పు చేస్తున్నట్లుగా భయపడిపోయారు. ఇద్దరికీ ఆల్‌రెడీ లవర్స్ ఉన్నప్పటికీ హౌస్‌లో ఒకరికొకరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతున్నామని, ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని సంఘర్షణకు లోనయ్యారు.
తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన సిరి తల్లి కూడా వీళ్ల ఫ్రెండ్‌షిప్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. షణ్ముఖ్ ను హత్తుకోవడం నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేసింది. తప్పు చేస్తున్నావంటూ సిరిని హెచ్చరించింది. ఆమె మాటలతో హౌస్ అంతా షాకైంది. షణ్ముఖ్ తల్లి కూడా వీళ్ల ప్రవర్తనపై ఆగ్రహంతో ఉందట! మాటిమాటికీ హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడాన్ని తప్పుపట్టిందట! షణ్ముఖ్ తో ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని సిరికి ముఖం మీదే చెప్పినట్లు సమాచారం. మరి పేరెంట్స్ హెచ్చరికలతోనైనా సిరి- షణ్ముఖ్ లో ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి మరి!