ఈ వారంలో హౌస్‌మేట్స్ చేసిన కొన్ని తప్పులను సరిదిద్దడానికి హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్ లో మాట్లాడుతూనే ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. మొదట సిరి ఇటీవల షణ్ముఖ్ తనతో మాట్లాడట్లేదని, ప్రతిసారి కావాలనే తనని దూరం పెడుతున్నాడని అలగడంతో పాటు తనకు తాను హర్ట్ చేసుకోవడంపై స్పందించాడు నాగార్జున.
కోట్లమంది ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని.., వారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి తప్ప ఎందుకు ఇలా చేస్తున్నారో అని భయపడకూడదని అసలు అలా తనని తాను బాధించుకోవడానికి కారణం ఏంటో చెప్పమని అడగగా అలా ఎందుకు చేస్తున్నానో అర్ధం అవట్లేదని.. నా స్టొరీ నాకు తెలుసు.. నేను బయట ఏంటో తెలుసు కాని ఇక్కడ ఎందుకు అలా కనెక్షన్ వస్తుందో తెలియట్లేదని సిరి చెప్తుంది.
ఇక ఆ తరువాత షణ్ముఖ్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన నాగార్జున.. అసలు అలా డల్ ఎందుకు అయిపోయావని అని అడగగా ఏమో సర్ మానసికంగా వీక్ అయిపోయానని, దీప్తిని మిస్ అవుతున్నానని ఆమె చాలా గుర్తువస్తుందంటూ చెప్పడంతో వెంటనే నాగార్జున బిగ్ బాస్ హౌస్ గేట్స్ ఓపెన్ చేయమని చెప్పడం.. దీప్తిని మిస్ అవుతున్న అనుకుంటే ఇంటి నుండి బయటికి వెళ్ళాలని చెప్పడంతో షణ్ముఖ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.