ఈ శనివారం బిగ్‌బాస్ ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’ సందర్భంగా ఇచ్చిన టాస్క్‌ను నాగార్జున మళ్లీ హౌస్‌మేట్స్‌కు ఇచ్చారు. అప్పుడు టాస్క్‌లో పాల్గొని, వివిధ రకాల పానీయాలు, పదార్థాలు కలిపిన డ్రింక్‌ను తాగిన హౌస్‌మేట్స్‌కు రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇచ్చారు. దీంతో రవి.. షణ్ముఖ్‌ను ఎంచుకున్నాడు. ‘ప్రజలారా ఈ అన్యాయం చూడండి’ అని షణ్ముఖ అనగా, ‘అప్పుడు మీరు చేసిన దానికి ఇది’ అంటూ రవి పంచ్‌లు వేశాడు. ఇక శ్రీరామ్.. సన్నీని ఎంపిక చేసుకుని, అతనికి ఇష్టమొచ్చిన రీతిలో పదార్థాలు కలిపి తాగమని చెప్పాడు. ‘ఉల్లిపాయ తిని ఇది తాగు వెళ్లిపోతుంది’ అని శ్రీరామ్ అనగా, ‘ఏదో జన్మలో నాకు భర్తవి అయి ఉంటావు. దయచేసి ఆపరా’ అని సన్నీ బతిమలాడుకున్నాడు. ‘వాంతి చేసుకున్నా అవుట్ అయినట్టే’ అని నాగార్జున చెప్పడంతో తాగిన దానిని మింగలేక, కక్కలేక సన్నీ పలికించిన హావభావాలు నవ్వులు పూయిస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమోలు చూసి ఎంజాయ్ చేయండి.