బిగ్ బాస్ మొదలై 9 వారాలు గడిచిపోయింది. 19 మందితో మొదలైన బిగ్ బాస్ ఒక్కొక్కరుగా ఒక్కో వారం వెళ్లిపోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, లోబో, ప్రియాలు ఎలిమినేట్ అయ్యారు. ఇక గత వారం కెప్టెన్ షన్ను తప్ప అందరూ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత యాని మాస్టర్, మానస్ స్పెషల్ పవర్ తో సేఫ్ అయ్యారు. దీంతో ఈ వారం శ్రీరామచంద్ర, కాజల్, సన్నీ, సిరి, జెస్సీ, యాంకర్ రవి, విశ్వ, ప్రియాంక నామినేట్ అయ్యారు.
చివరకు వీరిలో కాజల్, ప్రియాంక , విశ్వ మిగిలారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆడుతూ వస్తున్న విశ్వ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. విశ్వ ఎలిమినేట్ అని అనౌన్స్ చేయగానే ఆనీ మాస్టర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. సన్నీ, శ్రీరామ్ కూడా ఎమోషనల్ అయ్యారు.
విశ్వ ఎలిమినేషన్‌తో ఇంటిసభ్యులు డల్ అయిపోయారు. బెస్ట్ సంచాలకుడు, బెస్ట్ రేషన్ మేనేజర్, బెస్ట్ కెప్టెన్, బిగ్‌బాస్ హౌస్‌కు సూపర్ హీరో విశ్వ అని అతడిని ఆకాశానికెత్తారు. ఎంతో బాగా గేమ్ ఆడే విశ్వ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇక విశ్వ వెళ్లిపోతూ కంటెస్టెంట్లకు ర్యాంకులివ్వడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చాడు.