Bright Telangana
Image default

Election Results: గుజరాత్‌లో బీజేపీ ఏడోసారి విజయఢంకా..

bjp-historic-win-in-gujarat-congress-won-in-himachal

Election Results: గుజరాత్‌లో బీజేపీ విజయఢంకా మోగించింది. ఆ రాష్ట్రంలో ఏడో సారి కాషాయ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన అక్కడ ఓటర్లు ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. ప్రతి ఐదేళ్లకు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు వేర్వేరు పార్టీలకు అవకాశం ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్లను ఆ పార్టీలు దాటాయి.

గుజరాత్ లో మొత్తం సీట్లు 182. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఇప్పటివరకు 144 స్థానాల్లో గెలుపొందింది. 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది, ఏడు స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు.

ఇక హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 68. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు 37 స్థానాల్లో గెలుపొందింది. మరో మూడు స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటివరకు 23 స్థానాల్లో గెలుపొంది, మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇతరులు మూడు సీట్లు గెలుచుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే, తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

Related posts

Huzurabad By Elections: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

Hardworkneverfail

Two notices to Raja Singh: రెండు నోటీసులు.. ఇన్నిరోజులు పోలీసులు నిద్రపోతున్నారా? రాజాసింగ్ ఆగ్రహం

Hardworkneverfail

దళిత బంధు అమలు చేయకపోతే.. ఉద్యమం తప్పదు : బండి సంజయ్ వార్నింగ్

Hardworkneverfail

PM Modi: ‘అగ్నిపథ్ పథకం’పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..

Hardworkneverfail

High Court of Telangana : బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతి

Hardworkneverfail