Former CM Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) నిన్న గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాదులో నేడు ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్ కు అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ నుంచి రోశయ్య అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. రోశయ్య అంత్యక్రియలు మధ్యాహ్నం 1.30 గంటలకు కొంపల్లి ఫాంహౌస్ లో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రోశయ్య అంత్యక్రియలకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.