D Srinivas to Re-Join Congress : టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ త్వరలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కానీ, చేరే తేదీ మరియు వేదిక ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. తాజా సమాచారం ప్రకారం, డి శ్రీనివాస్ జనవరి 24 న న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో అధికార టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది.
వేదిక, తేదీ మారే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన తర్వాత 2015 జూలైలో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను సీఎం కేసీఆర్ రాజ్యసభకు నామినేట్ చేశారు.