Bright Telangana

Huzurabad By Election: రసవత్తరంగా మారిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక

హుజూరాబాద్‌ ఉపఎన్నిక బరిలో ప్రధానపార్టీల అభ్యర్థులు, వందలాదిమంది నిరుద్యోగులతో పాటు పీల్డ్‌ అసి స్టెంట్లు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం లేదన్న కారణంతో ఈసారి దాదాపు 1000 మంది వరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.ప్రతీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు కనీసం రూ.10వేల ధరావతు, అభ్యర్థికి మ ద్దతిస్తూ స్థానికంగా పదిమంది సంతకాలు చేయా లి. వీరంతా పోటీ చేయాలంటే కనీసం రూ.కోటి నగదు,కనీసం 10వేలమంది స్థానికుల మద్దతు అవసరం. వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో 200 మంది నిరుద్యోగులు బరిలో నిలుచుంటామంటున్నారు. ఈ అందరికీ ధరావతు, స్థానికుల మద్దతు ఎంతమేరకు లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలావుంటే, మినేషన్లు వేసే RDO ఆఫీసు వద్ద 144 సెక్షన్ పెట్టారు. అభ్యర్థి తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు. సోమవారం ఈటల జమునతోపాటు మరో ఇద్దరు అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. మంగళవారం ఎక్కువ సంఖ్యలో పడే అవకాశం ఉంది. నామినేషన్లు స్వీకరణ మొదలైన తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేశారు. ఈనెల 8న బీజేపీ అధికారిక అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Related posts

Two notices to Raja Singh: రెండు నోటీసులు.. ఇన్నిరోజులు పోలీసులు నిద్రపోతున్నారా? రాజాసింగ్ ఆగ్రహం

Hardworkneverfail

Bandi Sanjay Got Bail : బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట.. బెయిలు మంజూరు

Hardworkneverfail

TRS: కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ధర్నాలు

Hardworkneverfail

Huzurabad By Election : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం – ఈటల రాజేందర్

Hardworkneverfail

Vijayasanti : సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సెటైర్లు

Hardworkneverfail

Revanth Reddy: టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీ లేదు.. డ్రామా ముగిసింది

Hardworkneverfail