Police Takes Revanth Reddy into Custody : సోమవారం హైదరాబాద్ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వైపు ‘రచ్చబండ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ బయలుదేరారు. రేవంత్ రెడ్డి నీ అరెస్టు చేయడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎర్రవేల్లిలో కాంగ్రెస్ నేతలు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశ్నించారు.