Bright Telangana
Image default

KTR US Tour : తెలంగాణకు పెట్టుబడుల వరద.. అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన

KTR US Tour

[the_ad id=”6756″]

KTR US Tour Ended With Huge Investments : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఖరారైంది. తొలిరోజు నుంచి అత్యంత బిజీబిజీగా గడిపిన మంత్రి కేటీఆర్ (KTR US Tour) చివరి రోజు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలోని కంపెనీలు గణనీయమైన పెట్టుబడులు పెట్టాలనే కోరికను సూచించాయి.

న్యూజెర్సీ లో పని చేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా హైదరాబాద్ ఫార్మాలో సుమారు రూ. 150 కోట్లు పెట్టుబడితో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. రానున్న మూడు సంవత్సరాల్లో రూ. 150 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తమ కంపెనీ గతంలో హైదరాబాద్ ఫార్మా రంగంలో రూ.2,300 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు స్లే బ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈఓ అజయ్ సింగ్ మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

అమెరికాకు చెందిన మరో ఫార్మా సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా 2 లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే అడ్వాన్స్‌డ్‌ ల్యాబ్‌లో 50 మంది అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం పని చేస్తుందని కేటీఆర్‌కు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో సుమారుగా 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో తాము ఏర్పాటు చేసే ఈ అత్యాధునిక ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉన్నయని పేర్కొన్నారు. 200 మంది ఐటీ నిపుణులతో కూడిన బలమైన వర్క్ ఫోర్స్‌తో హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుట్లు స్ప్రింక్లర్ కంపెనీ బృందం మంత్రికి తెలియజేసింది. కాగా, అమెరికాలో ఉన్న కాల్ అవే గోల్ఫ్ కంపెనీ హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Related posts

ప్రపంచంలో ఇప్పుడు అత్యంత సంప‌న్న దేశంగా చైనా..!

Hardworkneverfail

Moinabad Farm House Deal Video : బీజేపీ గుట్టు రట్టు చేసిన సీఎం కేసీఆర్..

Hardworkneverfail

టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆమోదం

Hardworkneverfail

TRS: కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ధర్నాలు

Hardworkneverfail

Huzurabad By Elections: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

Hardworkneverfail

Munugode Bypoll : మునుగోడు ఫలితాలు లైవ్‌ అప్‌డేట్స్‌..

Hardworkneverfail