Bright Telangana
Image default

అన్ని భాషల్లాగే హిందీ ఒకటి : మంత్రి కెటిఆర్

Telangana Minister KTR

TRS Opposes Move to replace English with Hindi in IIT : ఐఐటీల వంటి టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉన్నత విద్యాసంస్థల్లో బోధనా హిందీలో ఉండాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసును తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తీవ్రంగా వ్యతిరేకించింది. హిందీని రుద్దేందుకు తమ పార్టీ వ్యతిరేకమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు బుధవారం అన్నారు. భారతదేశానికి జాతీయ భాష లేదని, అనేక అధికార భాషల్లో హిందీ కూడా ఒకటని ఆయన అన్నారు.

ఐఐఐటిలు మరియు కేంద్ర ప్రభుత్వ నియామకాలలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా, ఎన్‌డిఎ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తోందని, భారతీయులకు భాష ఎంపిక ఉండాలనేది మరియు హిందీ విధింపుకు మేము నో చెబుతున్నాము” అని రామారావు ట్వీట్ చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాన్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, నవోదయ విద్యాలయాల్లో హిందీ మీడియం మాత్రమే అమలు చేయాలని అమిత్ షా కమిటీ ప్రతిపాదించింది. కేవలం.. తప్పనిసరి అనుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని.. అక్కడ కూడా నెమ్మదిగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించారు.

ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో.. తప్పనిసరిగా ఉన్న ఇంగ్లీష్ స్థానంలో హిందీ పేపర్‌ను కంపల్సరీ చేయాలని ప్రతిపాదించారు. ఎంపిక చేసే ఉద్యోగులకు కూడా హిందీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల్లోనూ హిందీ అనువాదం ఉండేలా చూడాలని.. తీర్పులు కూడా హిందీలోనే ఇచ్చే అవకాశం కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కూడా మాట్లాడుతూ.. ఫెడరలిజం, జాతీయ సమైక్యతకు విరుద్ధమని అన్నారు.

Related posts

BRS : అమరావతిలో భారీ బహిరంగ సభకు కెసిఆర్‌ ప్రణాళిక ..

Hardworkneverfail

High Tension at Kothagudem : వనమా రాఘవను అరెస్ట్ చేయాలంటూ అఖిలపక్షం డిమాండ్

Hardworkneverfail

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు..

Hardworkneverfail

KTR : మోదీ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్..

Hardworkneverfail

దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఐటీ రైడ్స్ ఉండవు – మంత్రి మల్లారెడ్డి

Hardworkneverfail

Huzurabad By Election Exit Poll Survey : గెలుపెవరిది..?

Hardworkneverfail