తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతతో ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఓటు వేసే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఈవీయంలకు ఎన్నికల సిబ్బంది సీల్ వేస్తున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 86.4 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్‌లో చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, మొత్తం మీద పోలింగ్ ప్రశాతంగా ముగిసిందని వెల్లడించారు. పోలింగ్ అనంతరం ఈవీయంలను కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఏర్పాట చేసిన స్ట్రాంగ్ రూంకు భారీ భద్రత నడుమ తరలించనున్నారు.
పోలింగ్ ముగియడంతో ఇప్పుడు గెలుపు ఎవరిదని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుచోట్ల భారీగా బెట్టింగ్‌లు కూడా కొనసాగుతున్నాయి.
ఇదిలావుంటే వార్ ఎలా సాగినా.. ఓటరు దేవుడు ఎటువైపు మొగ్గు చూపాడనేదే ఇప్పుడు కీలకంగా మారింది. గెలుపు ఓటములపై కొన్ని ఏజెన్సీలు సర్వే నిర్వహించాయి. వారు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వే వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఆ సర్వే వివరాలు ఈ వీడియోలో చూడండి