తెలంగాణ : సీఎం కేసీఆర్ నిన్న టీఆర్‌ఎస్ భవన్‌లో చెప్పిన విధంగానే… దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ లో కోరారు సీఎం కేసీఆర్. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్ చేశారు కేసీఆర్.
40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమనే నిబంధనను మరింతగా పెంచి, పంజాబ్ రాష్ట్రంలో మాదిరి తెలంగాణలో కూడా ఈ 2021 -22 వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. ఇందుకు సంబంధించి చర్యలు త్వరగా తీసుకోవాలని విజ్జప్తి చేశారు సీఎం కేసీఆర్.