న్యూఢిలీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. రైతుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
‘రైతులు ఆందోళన విరమించాలి. మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదురెట్టు పెంచాం. తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం’ అని మోదీ తెలిపారు. ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తాం’’ అని ప్రధాని మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.