తెలంగాణ (గద్వాల) : గద్వాల పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా.. ఆకస్మికంగా మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడంతో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఈ రోజు సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వివిధ రకాల పంటలను పరిశీలించారు. అంతేకాకుండా అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ రైతులతో మాట్లాడుతూ.. పత్తి, వేరుశనగ, మినుములు,పెసర్లు సాగు చేయాలన్నారు. వరిలాంటి ఒకే రకం పంట వేసి ఇబ్బంది పడొద్దని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అనంతరం కొండతండాలో పర్యటించిన సీఎం కేసీఆర్ రైతులతో ముచ్చటించారు.
మినుములు, వేరుశనగ సాగుకు ఖర్చు ఎంత.. మార్కెట్‌లో ధర ఎంత ఉందని ఓ రైతును కేసీఆర్ అడగగా.. దానికి స్పందించిన రైతు మినుములు ఎకరాకు 8 నుంచి 12 క్వింటళ్ల దిగుబడి వస్తోందని తెలిపాడు. అంతేకాకుండా క్వింటాల్‌కు రూ.8 వేలకు పైగా వస్తుందని రైతు వెల్లడించాడు. పంటల మార్పిడి వల్ల భూసారం పెరిగి దిగుబడి ఎక్కువగా వస్తోందని, నీళ్లు, 24 గంటల కరెంటుతో దిగుబడి బాగా పెరిగందని రైతులు వెల్లడించారు.
Dalitha Bandhu Scheme : దళితబంధు పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష