మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పుచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు. ఈ సోమవారం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి, బషీర్ బాగ్ లోని బాబు జగ్జివన్ రావు.. అనంతరం గన్ పార్కు లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్ కు బయల్దేరిన ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు.
అయితే మోత్కుపల్లి నర్సింహులు కు ఓ కీలక పదవి కూడా ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు స్పష్టమైన హామీ వచ్చినట్లు సమాచారం.