Huzurabad By Election: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరుగనున్నది. ఈ ఒక్క ఉప ఎన్నికలో భాగంగా రాష్ట్రంలో రాజకీయం మారిపోయింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజాగర్జన సభ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ సంస్థగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. ఈ సారి హుజూరాబాద్ ఉప ఎన్నికలో మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.. ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుందామని అన్నారు. ప్రతి రోజు 20 నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించాలన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 27న భారీ సభ ఉంటుందని కేసీఆర్ తెలిపారు. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారానికి సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
Dalitha Bandhu Scheme : దళితబంధు పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష