Bright Telangana
Image default

Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ గా మెగాస్టార్ చిరంజీవి.. అదిరిపోయిన టీజర్..

Waltair Veerayya title teaser out

Waltair Veerayya Title Teaser Out : బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ మూవీ తో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య గా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మెగా 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్ అలాగే టీజర్లు ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించాయి. కాగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

ఏంట్రా ఆడొస్తే పూనకాలన్నాడు.. అడుగేస్తే అరాచకం అన్నాడు.. ఏడ్రా మీ అన్నయ్య.. సౌండే లేదు.. అంటూ విలన్ చెప్పే డైలాగ్.. రివర్స్ ఆర్డర్‌లో స్క్రీన్ ప్లేని తీసుకెళ్తూ.. బీడీ తాగుతున్న చిరంజీవిని చూపించేశాడు డైరెక్టర్ బాబీ. చిరంజీవి మ్యానరిజం, యాటిట్యూడ్ అన్నీ కూడా మెప్పించాయి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే.. లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చేయండి అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ సూపర్బ్. బాబి టేకింగ్‌కు.. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చివర్లో హ్యాపీ దివాళి.. తొందర్లోనే కలుద్దామంటూ రవితేజ వాయిస్ వినిపించడం హైలెట్.

ఈ మూవీలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ కొట్టే సంగీతం, ఇచ్చే పాటలు హైలెట్ అవ్వనున్నాయని టాక్. మాస్ సాంగ్స్‌తో ఊపు ఊపేస్తాడని సమాచారం. ఆల్రెడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో.. నేడు రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీని సంక్రాంతి బరిలోకి దించేందుకు మైత్రీ మూవీస్ ప్రయత్నిస్తోంది. ఈ సారి సంక్రాంతికి మైత్రి మూవీస్ పోటీ పడుతున్నాయి. మైత్రీ మూవీస్ ఇటు చిరంజీవి, అటు బాలయ్య సినిమాలతో సందడి చేయబోతోంది.

Related posts

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటించిన కేంద్రం

Hardworkneverfail

God Father Movie : ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ డిజిటల్ రైట్స్ అమ్మకాలు..?

Hardworkneverfail

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌.. పూనకాలు లోడింగ్‌ అంటే ఇదేనేమో!

Hardworkneverfail

MEGA 154 : మెగాస్టార్ చిరంజీవి సరసన మెరవనున్న శ్రుతిహాసన్!

Hardworkneverfail

Acharya Trailer : ‘ఆచార్య’ మూవీ ట్రైలర్ మామూలుగా లేదుగా..

Hardworkneverfail

Waltair Veerayya : మెగా మాస్‌ సాంగ్‌.. పూనకాలు లోడింగ్‌..

Hardworkneverfail