Bright Telangana
Image default

MEGA 154 : మెగాస్టార్ చిరంజీవి సరసన మెరవనున్న శ్రుతిహాసన్!

Mega154 Shruti Haasan to play female lead in Chiranjeevi movie

Shruti Haasan in Chiranjeevi 154 Movie : శ్రుతిహాసన్ టాలీవుడ్ కి కొంతకాలం పాటు దూరమైంది. దీంతో తన కెరియర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో పడింది. అందులో భాగంగా ఆమె చేసిన ‘క్రాక్’ మూవీ బాగా కలిసొచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఈ మూవీ శ్రుతిహాసన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను తెచ్చిపెట్టింది.

ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’ నుంచి కూడా అవకాశం శ్రుతిహాసన్ ను వెతుక్కుంటూ వెళ్లింది. ఈ మూవీ తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని శ్రుతిహాసన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రుతిహాసన్.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ కాంబినేషన్లోని మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి మూవీకి(MEGA 154) కూడా సైన్ చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు రవీంద్ర (బాబీ) ‘వాల్తేర్ వీర్రాజు’ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో కథానాయికగా శ్రుతిహాసన్ ను సంప్రదించారు. దాదాపు ఆమెనే ఖరారు అవుతుందని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Related posts

Megastar Chiranjeevi : వెంకీ కుడుములతో మూవీ ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

Hardworkneverfail

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. ?

Hardworkneverfail

Acharya Movie Song Controversy : వివాదంలో ‘ఆచార్య’.. ఆర్ఎంపీ డాక్టర్ల ఫిర్యాదు

Hardworkneverfail

Mega 154 Update: ఊర మాస్ అవతార్…మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి

Hardworkneverfail

కృష్ణ‌వంశీ ‘రంగమార్తాండ’ మూవీకి మెగాస్టార్ చిరంజీవి స్వరం…!

Hardworkneverfail