Wireless Electric Road Charging for Electric Vehicles in Sweden : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. సహజ వనరులు వేగంగా హరించుకుపోతుండడంతో ప్రపంచ దేశాలన్నీ విద్యుత్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం ప్రకటించడమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్లను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే.. స్వీడన్ అద్భుతం చేసింది. ప్రయాణంలోనే వాహనాలు ఛార్జింగ్ అయ్యే రోడ్లను (Wireless Electric Road Charging) అందుబాటులోకి తెచ్చింది.