Turbine Kite: గాలి పటాలతో విద్యుత్‌ను ఉత్పతి చేయొచ్చా…? స్కాట్లాండ్‌లోని ఒక వ్యక్తికి ఈ ఆలోచన రావడమే కాదు… దాన్ని ఆచరణలో కూడా పెట్టారు. గాలి మరల ద్వారా విద్యుత్ తయారు చేస్తున్నప్పుడు గాలి పటాల ద్వారా ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించిన ఆయన ‘ఫ్లయింగ్ టర్బైన్’ టెక్నాలజీని ఆవిష్కరించారు. పదేళ్లపాటు దీని కోసం పని చేసిన ఆ స్కాటిష్ వ్యక్తి ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుకే విద్యుత్‌ను అందించొచ్చని చెబుతున్నారు.