Palvoncha Suicide Case (ఖమ్మం) : నాగ రామకృష్ణ కుటుంబసభ్యుల ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకోవడం.. ఆ సెల్ఫీ వీడియో బయటకు రావడం.. దానిలోని తమ కుటుంబం ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని.. రాఘవ లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు.. డబ్బు రూపంలో అడిగినా రాఘవకు ఇచ్చేవాడిని.. కానీ, ఏ భర్త కూడా వినగూడని మాట రాఘవ అడిగారు.. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగాడు వనమా రాఘవ.. రాజకీయ బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు అని రామకృష్ణ ఈ వీడియోలో పేర్కొన్నాడు. దీన్ని జీర్ణించుకోలేక రాఘవేంద్ర ఒంటరిగా చనిపోతే కుటుంబ సభ్యులను వదిలిపెట్టరు అందుకే కుటుంబ సభ్యులతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా తన తల్లి, సోదరి కూడా తనను వేధించారని ఆరోపించారు.