Bright Telangana
Image default

వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్ కోర్టు..

Vanama Raghavan remanded in custody for 14 days

14 Days remand for Vanama Raghava : పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారకుడంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. వనమా రాఘవను పోలీసులు విచారించిన అనంతరం కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో రాఘవకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతనిని భద్రాచలం జైలుకు తరలించారు. కాగా, రామకృష్ణ ఫ్యామిలీని బెదిరించినట్టు వనమా రాఘవ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

గతంలో వనమా రాఘవ పై 12 కేసులు ఉన్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ మీడియా ముందు తెలిపారు. తాజాగా రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో రాఘవతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసుకు సంబంధించి వనమా రాఘవతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు.

కాగా, తన తనయుడు పై ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాయడం తెలిసిందే. తన తనయుడు పోలీసు విచారణకు సహకరించేలా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Related posts

Vanama Raghava: వనమా రాఘవ ఆగడాలకు హద్దే లేదా ?

Hardworkneverfail

Palvoncha Suicide case: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు కామానికి కుటుంబం బలి!

Hardworkneverfail

Palvoncha Suicide Case : రామకృష్ణ మరో సంచలన సెల్ఫీ వీడియో..

Hardworkneverfail