Bright Telangana

భారత్‌లో దాడులకు అఫ్గాన్‌ ఉగ్ర సంస్థలు పన్నాగం

రాబోయే పండుగ సీజన్ లో దేశంలో భారీ దాడులకు ఉగ్ర సంస్థలు పన్నాగం పన్నినట్లు నిఘా సంస్థలు హెచ్చరించాయి. పాకిస్తాన్ మద్దతుతో అఫ్గానిస్తాన్ కు చెందిన 40 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సరిహద్దుల వద్ద సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చాయి. జమ్ముకశ్మీర్ లోకి చొరబడి దేశవ్యాప్తంగా వీరు దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఈ మేరకు పారామిలిటరీ, రాష్ట్ర పోలీసులతో పాటు సంబంధిత ఏజెన్సీలను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి.