Bright Telangana
Image default

iPhone 14 : ఐఫోన్-14 ఫీచర్స్​ లీక్.. మాములుగా లేవుగా!

iphone 14 features leaks

కొత్తగా వచ్చే ఐఫోన్​ సిరీస్ లపై, వాటిల్లో ఫీచర్స్ ఎలా ఉండనున్నాయనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది విడుదల కానున్న ఐఫోన్​ 14 (iPhone 14) సిరీస్​కు సంబంధించి పలు ఫీచర్లు లీకయ్యాయి. ఐఫోన్‌ 14 (iPhone 14) సిరీస్‌ ఫోన్‌లలో 48 మెగా పిక్సెల్‌ ప్రైమరీ షూటర్‌, న్యూ చిప్‌ సెట్‌ తో పాటు 3ఎన్‌ఎమ్‌ లేదంటే 4ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌లు ఉండనున్నాయి. కొత్తగా వస్తున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ నుంచి ఇకపై అన్నీ ఫోన్లకు పోర్ట్‌ లెస్‌ డిజైన్‌తో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐఫోన్‌ 14 (iPhone 14) ఫీచర్లు :

వచ్చే ఏడాది విడుదల కానున్న ఐఫోన్‌ 14 సిరీస్‌… ఐఫోన్‌ 13 సిరీస్‌ ఐఫోన్‌ మిని, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13ప్రో, ఐఫోన్‌ 13ప్రో మ్యాక్స్‌లను మాదిరి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఐఫోన్‌ 14 సిరీస్‌లో మాత్రం 6.1 అంగుళాలతో ఐఫోన్‌ 14ప్లస్‌, 6.7అంగుళాలతో ఐఫోన్‌ 14మ్యాక్స్‌ మోడల్స్‌తో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే డిజైన్‌ విషయంలో ఆపిల్ సంస్థ ఐఫోన్‌ 14 సిరీస్‌ లో భారీ మార్పులు చేయనుంది. ఇప్పటికే డిజైన్ల మార్పులపై ఆపిల్ ప్రతినిధులు పనిచేస్తున్నారని ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ ఎనలిస్ట్‌ మార్క్‌ గుర్మాన్‌ తెలిపారు.

ఐఫోన్‌లలో నాచ్‌ డిజైన్‌ను తొలగించి..ఐఫోన్‌ 14 సిరీస్‌ నుంచి పంచ్‌ హోల్‌ కెమెరా ఉండగా, ప్రోమోడల్స్‌లో లిమిటెడ్‌గా ఓఎల్‌ఈడీ ప్యానల్‌ కింద ఫేస్‌ ఐడి సెన్సార్లను డిజైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

లీకైన రిపోర్ట్‌ల ప్రకారం.. ఐఫోన్ 14 సిరీస్‌ లో టచ్ ఐడి ఉండనుంది. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీలో టచ్ ఐడి పవర్ బటన్‌లో డిజైన్‌తో ఉంది.

ఐఫోన్‌ 14 సిరీస్‌ లో.. 4 డిజైన్‌లు ఉండనున్నాయి. ముఖ్యంగా ఫోన్‌ ఫ్లాట్‌ సైడ్‌ భాగంలో ఉండే వ్యాల్యూమ్‌, మ్యూట్‌ బటన్‌లు రౌండ్‌గా ఉండనున్నాయి. ఫోన్‌ వెనక భాగంలో ఫినిషింగ్‌ గ్లాస్‌ ఉండగా..సైడ్‌లు టైటానియంతో తయారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ప్యానెల్ కెమెరా బంప్ లేకుండా పూర్తిగా ఫ్లాట్‌గా ఉండనుంది.

ఐఫోన్‌ 13లో 3 ఎన్‌ఎం చిప్‌ సెట్‌లు ఉండగా..ఐఫోన్‌ 14లో 4 ఎన్‌ఎంలు చిప్‌ సెట్‌లు ఉండనున్నాయి.

చాలా కాలంగా ఐఫోన్‌లు పూర్తిగా పోర్ట్‌లెస్ డిజైన్‌కు మారుతాయని ప్రచారంలో ఉంది. కానీ ఐఫోన్‌ 13 సిరీస్‌ లో సైతం ఈ పోర్ట్‌ లెస్‌ డిజైన్‌తో విడుదల చేయలేదు. అయితే ఐఫోన్ 14 సిరీస్‌ వైర్‌లెస్‌గా మారే అవకాశం ఉందని లీకైన రిపోర్ట్‌ల ఆధారంగా తెలుస్తోంది.

Related posts

Apple iPhone 14 Plus : భార‌త మార్కెట్లోకి వచ్చేసిన ఐఫోన్ 14 ప్లస్ ..

Hardworkneverfail