Bright Telangana
Image default

ATM Charges : ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. జనవరి ఒకటి నుంచి పెరుగనున్న ఏటీఎం చార్జీలు

ATM Transactions

ATM Transactions : ఇండియాలో నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే ఈ ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా ఆర్బీఐ నుండి మరో షాకింగ్ న్యూస్ అందింది. అసలు విషయం ఏంటంటే జనవరి 1 నుంచి ఏటీఎం ఛార్జీలు పెంచనున్నారు. తాజాగా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితికి మించి చేసే నగదు, నగదేతర ట్రాన్సాక్షన్స్‌పై అదనపు ఛార్జీలను పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతించడంతో చార్జీలు పెరగనున్నాయి.

వచ్చే ఏడాది జనవరి 01వ తేదీ నుంచి ఏటీఎం చార్జీలను పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులు వెల్లడించింది. ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే.. ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ. 21తో + జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. కావున బ్యాంకు కస్టమర్స్ తమ బ్యాంకుల ;వెబ్ సైట్’ లలో వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించింది.

ఆగస్టు ఒకటో తేదీ నుండి పరిమితికి మించి..జరిపే ఏటీఎం ట్రాన్సాక్షన్ కు ఇంటర్ చేంజ్ ఫీజు రూ. 15 నుంచి రూ. 17, ఆర్థికేతర ట్రాన్సాక్షన్లకు రూ. 5 నుంచి రూ. 6 వరకు పెంచడానికి ఆర్బీఐ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.