Attack on Bihar CM Nitish Kumar : ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై దాడికి యత్నించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌లోని పాట్నా జిల్లా భక్తియార్‌పూర్ బ్లాక్‌లో స్వాతంత్ర్య సమరయోధుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న బీహార్ సీఎంపై ఓ గుర్తుతెలియని వ్యక్తి దాడికి యత్నించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అపరిచితుడు సెక్యూరిటీ గార్డులను తోసేస్తూ వేదికపైకి వెళ్లి దాడి చేయడం వీడియోలో కనిపించింది. అయితే, సీఎంకు ఎలాంటి నష్టం వాటిల్లకుండానే ఆయన వెంటనే పట్టుబడ్డారు. అతడిని స్థానిక పోలీసులకు అప్పగించి ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.