Bright Telangana
Image default

Unstoppable With NBK : ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’..

unstoppable-with-nbk

Balakrishna Unstoppable Show is India Top Rated Show : నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే మొదటిసారిగా చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ ఆహా యాప్ లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ‘అన్ స్టాపబుల్’ షో 8 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఈ షోను తనదైన శైలితో నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతి ఎపిసోడ్ కూడా టాప్ రేటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇండియాలోనే ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్నా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో మొదటి స్థానంలో నిలిచింది.

ఐఎండీబీ ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 పాయింట్లతో ‘అన్ స్టాపబుల్’ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. 2 వ స్థానంలో కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ నిలువగా, ఈ షోకు 7.8 పాయింట్లు దక్కాయి. ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 పాయింట్లతో 10 వ స్థానంలో నిలిచింది. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షో.. టాప్ 50 షోలను సెలెక్ట్ చేయగా ఐఎండీబీలో మొదటి స్థానంలో నిలిచింది.

ఐఎంబీడీ.. మూవీస్, టీవీ సిరీస్ లు, టాక్ షోలకు రేటింగ్ ఇస్తుంటుంది మరియు ప్రేక్షకుల రేటింగ్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ఐఎండీబీ సంస్థ. ఈ విధంగా ఇచ్చిన రేటింగ్స్ లో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా బాలకృష్ణ మూవీ ‘అఖండ’ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది.

Unstoppable Season Finale Episode with Mahesh Babu

India Top Rated Show

Unstoppable Season Finale Episode with Mahesh Babu : నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ తనదైన శైలిలో చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షోకు ఆహా ఓటీటీలో మంచి రేటింగ్ వస్తోంది. ఇండియాలోనే నంబర్ వన్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ రికార్డు సృష్టించింది. ఐఎండీబీలో కూడా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షో ఏకంగా 9.8 రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ షో మొదటి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా వచ్చాడు. దీనికి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.

తాజాగా ఈ చివరి ఎపిసోడ్‌ (Unstoppable Season Finale) స్ట్రీమింగ్ ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. గత నెల డిసెంబర్ లోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో చివరి ఎపిసోడ్‌కు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణ షోకు కూడా చివరి ఎపిసోడ్ మహేష్‌ బాబుదే కావడం విశేషం. ఈ ఎపిసోడ్ కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్‌ షోలో భాగంగా 10 ఎపిసోడ్లు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి.

raviteja-and-director-gopichand-malineni-guests-in-balakrishna-unstoppable-with-nbk-show

విభేదాలకు తెరదించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో : బాలకృష్ణ, రవితేజల గత కొన్నేళ్లుగా మధ్య విభేదాలు ఉన్నాయని చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు తెరదించుతూ బాలకృష్ణ.. మాస్ మహారాజ్ రవితేజకు హోస్ట్‌గా వ్యవహరించారు. ‘అన్‌స్టాపబుల్’ షో ‘ఆహా’లో ఈ ఎపిసోడ్ డిసెంబర్ 31 . ఇక ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 31 నుండే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

Balakrishna Comments on Social Media Rumours : నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకులను అలరిస్తూనే, ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ పేరుతో హోస్ట్ గా అదరగొడుతున్నారు. ప్రతివాడు ఈరోజు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడు. పేరు వుండదు .. లొకేషన్ తెలియదు .. అడ్రెస్ ఉండదు. బాధ్యత లేకుండా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి మరియు బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు .. నా హీరో తోపు .. నీ హీరో సోపు .. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ.. దొరికితే దవడ పగిలిపోద్దీ. అని వార్నింగ్ ఇచ్చారు. అలాగే కానీ మనం చేయవలసింది ఒక్కటే .. ఊరు .. పేరు చెప్పుకోవడానికి ధైర్యంలేని ఈ వెధవలను క్షమించడమే ఉత్తమమని బాలకృష్ణ పేర్కొన్నారు. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే మనం ‘అన్ స్టాపబుల్’ అవుతాం” అని బాలకృష్ణ అన్నారు.

Unstoppable with NBK

Pushpa Special on Unstoppable with NBK : చాలా రోజులుగా ఎదురుచూసిన పుష్ప-ది రైజ్ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 17న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. బాలకృష్ణ ఈసారి ‘పుష్ప’ టీమ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న మరియు దర్శకుడు సుకుమార్ తో సందడి చేశారు. సామి పాటకు బాలకృష్ణతో కలిసి రష్మిక డ్యాన్స్ చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోని కూడా వదిలారు ఆహా మేకర్స్.

అల్లు అర్జున్ మరియు నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్‌లో తగ్గేదేలే డైలాగ్ చెప్పడం మామూలుగలేదు. అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూసిన ఈ ఎపిసోడ్ డిసెంబర్ 26 నుండే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

Unstoppable With NBK episode 3

ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య! : ఈ షోలో 3వ ఎపిసోడ్ కోసం కామెడీ కింగ్ బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆహ్వానించారు. ఇది ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ ఎపిసోడ్. సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌లో ఏఎన్నార్ ను బాలకృష్ణ ఇమిటేట్ చేసిన వీడియోను ‘ఆహా’ విడుదల చేయగా, ప్రస్తుతం అది ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. బ్రహ్మానందం కోరిక మేరకు బాలకృష్ణ.. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ ఒక సుదీర్ఘమైన డైలాగ్ చెప్పారు. బాలకృష్ణ చాలా స్పష్టంగా, పర్ఫెక్ట్ టోన్‌తో ఏఎన్నార్ డైలాగ్‌ని చెప్తుంటే, బ్రహ్మానందం మరియు అనిల్ రావిపూడి అలా చూస్తుండి పోయారు. ఇక ఈ ముగ్గురూ కలిసి పై ఏ రేంజ్ లో సందడి చేశారనేది పూర్తి ఎపిసోడ్ లో చూసేయవవచ్చు.

ఇక వచ్చే ఏడాది అనిల్ రావిపూడితోను బాలకృష్ణ ఒక మూవీ చేయనున్నారు. ఆల్రెడీ అనిల్ రావిపూడి ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా మూవీ ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. దేశవిదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు జాతర జరుపుకుంటున్నారు.