Bheemla Nayak Movie Total Business : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసింది అని చెప్పాలి. మూవీ పై ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అని చెప్పాలి, 2022 ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ టాప్ స్టార్ మూవీ ఇదే అవ్వడంతో అంచనాలు ఆల్ రెడీ భారీగా పెరిగి పోగా పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఆల్ రెడీ బిగ్ హిట్ గా నిలవడంతో కామన్ ఆడియన్స్ లో కూడా అంచనాలు తీసిపోని రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని రేంజ్ లో భీమ్లా నాయక్ మూవీ బిజినెస్ కూడా ఓవరాల్ గా జరిగింది అని చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ వకీల్ సాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 2 వారాల రన్ కే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సెకెండ్ వేవ్ టైం లో సొంతం చేసుకోగా ఆ మూవీకి మించిన బిజినెస్ ను ఇప్పుడు భీమ్లా నాయక్ మూవీ సొంతం చేసుకుంది. ఒకసారి మూవీ ఏరియాల వారి బిజినెస్..
నైజాం | 35.00 cr |
ఉత్తరాంధ్ర | 9.00 cr |
సీడెడ్ | 16.50 cr |
ఈస్ట్ | 6.40 cr |
వెస్ట్ | 5.40 cr |
గుంటూరు | 7.20 cr |
నెల్లూరు | 3.25 cr |
కృష్ణా | 6.00 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 88.75 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 9.00 cr |
ఓవర్సీస్ | 9.00 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 106.75 cr |
ఇదీ మొత్తం మీద భీమ్లా నాయక్ మూవీ (Bheemla Nayak Movie) సాధించిన ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కూడా ఇది బిగ్గెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. ఇక భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఈ టార్గెట్ ను అందుకుని 107 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
Bheemla Nayak Day Wise Total Collections : భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. భీమ్లా నాయక్ మూవీ తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంధ్ర లో లో టికెట్ రేట్ల కారణంగా దెబ్బ పడినా కానీ నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేసిన ఈ మూవీ ఓవరాల్ గా ఫస్ట్ డే మొత్తం మీద 26.44 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక వరల్డ్ వైడ్ గా భీమ్లా నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 34 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా భీమ్లా నాయక్ మూవీ ఇక్కడ అంచనాలను మించి 36.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ రెండో రోజు అంచనాలను మించి పోయి కలెక్షన్స్ ని సొంతం చేసింది అని చెప్పాలి. భీమ్లా నాయక్ మూవీ రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 12 కోట్ల నుండి 12.50 కోట్ల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేయగా ఆ అంచనాలను మించి పోయిన మూవీ రెండో రోజు ఏకంగా 13 కోట్ల మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది.
మూవీ రెండో రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూడో రోజు కి వచ్చే సరికి మూవీ మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా మూడో రోజు మూడో రోజు మూవీ 12.5 కోట్ల రేంజ్ నుండి 13 కోట్ల రేంజ్ అనుకుంటే మూవీ ఏకంగా 13.51 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
మూవీ నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 55% టు 60% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, కొన్ని చోట్ల మూవీ. బెటర్ గా హోల్డ్ చేసిన కొన్ని చోట్ల మూవీకి అనుకున్న దానికన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఫస్ట్ టైం మూవీ 4 వ రోజు అంచనాలను అందుకోలేక దెబ్బ పడగా 5.18 కోట్ల షేర్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సరిపెట్టుకుంది మూవీ. 3 వ రోజు తో పోల్చితే నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 8.33 కోట్ల రేంజ్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకుంది మూవీ.
5 వ రోజు మహా శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీ ఊరమాస్ గ్రోత్ తో దుమ్ము దుమారం చేసింది. 5 వ రోజు మహా శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ వలన గ్రోత్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద మూవీ 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేసినా ఆ అంచనాలను మించిపోయిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు ఏకంగా 7 కోట్ల మార్క్ ని కూడా అధిగమించి 7.25 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది.
భీమ్లా నాయక్ మూవీ మొత్తం మీద 106.75 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 5 రోజులు పూర్తీ అయిన తర్వాత మూవీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 24 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని భీమ్లా నాయక్ మూవీ సొంతం చేసుకుంటుందో చూడాలి.