Case Registered Against Dasari Arun Kumar : దివంగత నటుడు దాసరి నారాయణరావు తనయుడు తప్పుడు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. దాసరి అరుణ్ కుమార్ మద్యం మత్తులో కారుతో డ్రైవ్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. గురువారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నటుడు దాసరి అరుణ్ కుమార్ కారు ద్విచక్రవాహనాలను అతి వేగంతో ఢీకొట్టడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పెట్రోలింగ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నటుడిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. అరుణ్ పై కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే దాసరి అరుణ్ హీరోగా కొన్ని మూవీస్ లో కనిపించిన సంగతి తెలిసిందే.