Fire Accident In Movie Theatre – హైదరాబాద్: శివపార్వతి థియేటర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళనకు గురి చేసింది. నివేదికల ప్రకారం, శ్యామ్ సింగరాయ్ సినిమా సెకండ్ షో పూర్తయిన తర్వాత కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. షో ముగిసిన తర్వాత మంటలు చెలరేగడంతో పాటు థియేటర్ మొత్తం దగ్ధం కావడంతో ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.