హన్మకొండ జిల్లా: తనను నమ్మి ఓటు వేసిన ఓటర్ల కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయటం లేదని ఒక మహిళ వార్డ్ సభ్యురాలు గ్రామ పంచాయితీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు..హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన 1 వ వార్డ్ సభ్యురాలు తాల్లపెళ్ళి లలిత తన ఒకటవ వార్డ్ లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయటం లేదని ఆరోపించారు. కనీసం అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ పనులు కూడా జరగటం లేదని, గ్రామాల్లో తిరగలేక పోతున్నామని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నా ఎందుకు పనులుచేయడం లేదని ప్రజలు నిలదీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.