Bright Telangana
Image default

Android Apps : వెంటనే ఈ 26 యాప్స్ ఉంటే మీ మొబైల్ నుండి డిలీట్ చేయండి…

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు తెగబడుతున్నారు. మాల్ వేర్ లతో అడ్డంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ యాప్ లతో సైబర్ నేరగాళ్లు అడ్డంగా మోసగిస్తున్నారు.. దీనికి సంబంధించి గూగుల్ ఎప్పటికప్పుడు తన యూజర్లను అలర్ట్ చేస్తూనే ఉంది. మాల్ వేర్ యాప్స్ ను గుర్తించి వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తోంది.

అలాగే, మొబైల్ యూజర్లు ఒకవేళ తమ ఫోన్ లో వాటిని ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే డిలీట్ చేయాలని సూచిస్తుంది. తాజాగా గూగుల్ మరోసారి మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. 26 యాండ్రాయిడ్ యాప్స్ ను బ్యాన్ చేసింది. గ్రిఫ్ట్ హార్స్ యాండ్రాయిడ్ ట్రోజన్ కలిగున్న ఆ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయాలని కోరింది. 26 యాప్ ల ద్వారా యూజర్ల డబ్బును హ్యాకర్లు కాజేస్తున్నట్టు గూగుల్ గుర్తించింది.

గూగుల్ నిషేధించిన టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటి అంటే.. హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో, హార్ట్ రేట్, పల్స్ ట్రాకర్, లాకర్ టూల్, జియోస్పాట్, జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ – ఫైండ్ లొకేషన్, బస్ – మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫోటో, మై చాట్ ట్రాన్స్ లేటర్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో వంటివి ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న యాప్స్‌ను దాదాపు 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మీ మొబైల్ లో గనుక ఈ కింద పేర్కొన్న యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదకరమైన 26 యాప్స్ ఇవే..

  1. Heart Rate and Pulse Tracker
  2. Handy Translator Pro
  3. Geospot: GPS Location Tracker
  4. iCare – Find Location
  5. My Chat Translator
  6. Bus – Metrolis 2021
  7. Free Translator Photo
  8. Locker Tool
  9. Fingerprint Changer
  10. Call Recorder Pro
  11. Instant Speech Translation
  12. Racers Car Driver
  13. Slime Simulator
  14. Keyboard Themes
  15. What’s Me Sticker
  16. Amazing Video Editor
  17. Safe Lock
  18. Heart Rhythm
  19. Smart Spot Locator
  20. CutCut Pro
  21. OFFRoaders – Survive
  22. Phone Finder by Clapping
  23. Bus Driving Simulator
  24. Fingerprint Defender
  25. Lifeel – scan and test
  26. Launcher iOS 15