ఆధునిక జీవిన విధానంలో ప్రతీ పనికి విద్యుత్ పైనే ఆధారాపడుతుంటాం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ.. విద్యుత్ అవసరం సైతం అదేస్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో కరెంటు ‘ఉత్పత్తి- వినియోగం’ మధ్య వ్యత్యాసం రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటికే సౌరవిద్యుత్ విస్తృతంగా వినియోగంలోకి రాగా… తాజాగా పవన విద్యుత్ వైపు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇళ్లపైనే విండ్ పవర్ తయారు చేసుకునేలా హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ… ప్రత్యేక టర్బైన్ లను రూపొందించింది.