Bright Telangana
Image default

Miss Universe 2021: 21 ఏళ్ల తర్వాత.. మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న ఇండియా..

Miss Universe 2021

పంజాబీ : చండీగఢ్‌కు చెందిన హర్నాజ్‌ కౌర్‌ సంధూ మిస్ యూనివర్స్ 2021 టైటిల్‌ను కైవసం చేసుకుంది. 21 ఏళ్ల తర్వాత మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఇండియాకు ఇది మూడో టైటిల్‌. సుస్మిత సేన్ 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకోగా, 2000లో లారా దత్తా ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను కైవసం చేసుకుంది.

హర్నాజ్‌ కౌర్‌ సంధూ.. టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్ 2017, మిస్ మాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా 2018 మరియు ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019తో సహా రెండు టైటిల్‌లను కూడా గెలుచుకుంది. ఆమె పరాగ్వే మరియు దక్షిణాఫ్రికా నుండి పోటీదారులను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ప్రతి భారతీయుడు ఆమెకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు.

ఇక, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హర్నాజ్ కౌర్‌ సంధూ విజయం సాధించినట్టు ఓ పోస్టు పెట్టింది.. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో మిస్ యూనివర్స్ 2021 టైటిల్‌ను గెలుచుకున్న వార్తను ప్రకటించారు.. ‘కొత్త మిస్ యూనివర్స్ ఈజ్…ఇండియా,’ అంటూ క్లిప్‌కి క్యాప్షన్ ఇచ్చారు. క్లిప్‌లో మెక్సికోకు చెందిన మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా తన వారసురాలిగా మారిన హర్నాజ్‌కి పట్టాభిషేకం చేశారు.. ఇక, మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైన మిస్‌ ఇండియా హర్నాజ్‌ ఆనందానికి అవదులులేకుండా పోయాయి.